బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
తెలంగాణ

నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్

నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్

*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్** సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్, హుక్కా సెంటర్ల యజమానులతో సోమవారం సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, వ్యాపార సంస్థల యజమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ, వ్యాపార సంస్థలు చట్టబద్ధంగా, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. ప్రతి వ్యాపార సంస్థకు అవసరమైన అన్ని అనుమతులు, లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ ఎన్ఓసీ, సీఏంసీ ఎన్ఓసీ, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎన్ఓసీ, టౌన్ ప్లానింగ్ ఎన్ఓసీ తదితర అవసరమైన అనుమతులను పొందాలని సూచించారు. CPPMS పోర్టల్ ద్వారా జారీ చేసిన లైసెన్సుల గడువు ముగిసిన వెంటనే వాటిని సకాలంలో రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైసెన్సులు పొందిన సంస్థల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో హోటల్స్, రెస్టారెంట్లు, పబ్స్ తదితర వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీపీ తెలిపారు. కొన్ని సంస్థలు సరైన లైసెన్సులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, అనుమతులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.సమావేశంలో వ్యాపార యజమానులు తమ సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వివిధ శాఖలకు సంబంధించిన లైసెన్సులు, అనుమతుల సమయాలు వేర్వేరుగా ఉండటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, నిబంధనలకు లోబడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీపీ అధికారులను సూచించారు.పబ్స్, బార్లు తదితర సంస్థల్లో అనుమతించిన సమయం ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకలాపాలు కొనసాగించరాదని సీపీ స్పష్టం చేశారు. నిర్ణీత సమయాలను ఖచ్చితంగా పాటించాలని, సమయం ముగిసిన తర్వాత మద్యం విక్రయాలు లేదా ఇతర కార్యకలాపాలు నిర్వహించడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో బార్ అండ్ రెస్టారెంట్లు లోకి మైనర్లు ను అనుమతించవద్దని సూచించారు. వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి సరైన ఆధార్ ధృవీకరణ, గుర్తింపు పత్రాలు, వయస్సు నిర్ధారణకు సంబంధించిన వివరాలు తప్పనిసరిగా ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనర్లను నిబంధనలకు విరుద్ధంగా పనిలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు.హోటల్స్, పబ్స్, రెస్టారెంట్లలో వినియోగదారుల ప్రవర్తనపై కూడా యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సూచించారు. ఎవరైనా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు లేదా ఇతర ప్రముఖుల బంధువులమని చెప్పుకుని సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించినా వారికి ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. చట్టం అందరికీ సమానమేనని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.బార్లు, పబ్స్‌లలో గ్యాంగ్‌ల మధ్య గొడవలు, ఘర్షణలు జరిగే పరిస్థితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని సీపీ సూచించారు. ఇటువంటి ఘటనలు ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తాయని తెలిపారు. మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాల వినియోగం, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు వ్యాపార సంస్థల యాజమాన్యాలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. తెలంగాణలో హుక్కా కార్యకలాపాలు నిషేధించబడిన నేపథ్యంలో, ఎట్టి పరిస్థితుల్లోనూ హుక్కా సెంటర్లను నిర్వహించరాదని సీపీ స్పష్టం చేశారు. COTPA చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ హుక్కా కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.సైబరాబాద్ పోలీసుల లక్ష్యం వ్యాపారాలను అడ్డుకోవడం కాదని, చట్టబద్ధంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు నిర్వహించే వారికి సైబరాబాద్ పోలీసులు పూర్తి సహకారం అందిస్తారని సీపీ తెలిపారు. అయితే చట్టాలు, నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారాలు నిర్వహించే సంస్థలపై మాత్రం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.హోటల్స్, రెస్టారెంట్లు, పబ్స్ తదితర సంస్థల యజమానులు పోలీసులకు సహకరిస్తూ నిర్ణీత సమయాలు, లైసెన్సింగ్ నిబంధనలు, సిబ్బంది వయస్సు ధృవీకరణ, మాదకద్రవ్యాల నియంత్రణ, ప్రజా భద్రతకు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, ఐపీఎస్ సూచించారు.ఈ సమావేశంలో అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, ఐపీఎస్, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ఐపీఎస్, కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్, శేరిలింగంపల్లి డీసీపీ సీ.హెచ్. శ్రీనివాస్, ఐపీఎస్, ఎస్‌ఓటీ డీసీపీ శోభన్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]