హమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ *జగద్గిరిగుట్ట:-* రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించేలా హర్ష ప్రసాద్ రచించినట్లు పేర్కొంటున్న *కల్పత కథ’* పుస్తకంపై చర్యలు తీసుకోవాలని జగద్గిరిగుట్ట దళిత బహుజన సంఘం పోలీసులను కోరింది. ఈ మేరకు జగద్గిరిగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్కు వినతిపత్రం అందజేశారు. పుస్తకంలోని అంశాలు దళిత, బహుజన వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘం నాయకులు ఆరోపించారు. పుస్తకాన్ని విడుదల చేస్తే ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పుస్తక విడుదలను నిలిపివేయడంతో పాటు, హర్ష ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాజ్యాంగ నిర్మాతపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీయకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో DHPS రాష్ట్ర అధ్యక్షులు యేసురత్నం, CPI జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, ఎర్ర యాకన్న, డప్పు రామస్వామి, తొండ వెంకట్, ఎర్ర వీరన్న, చర్లపల్లి రాములు, హరినాథ్ రావు, కుమార్, గణేష్, నరేష్, బాబు, నరసింహ, హరినాథ్,కీర్తి,మాపల్లె శంకర్, ప్రమోద్, ప్రవీణ్,విజయ్, సంతోష్,జంబూ,వంశీ తదితరులు పాల్గొన్నారు.
హమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
