*ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్* జగద్గిరిగుట్ట:-జగద్గిరిగుట్ట 280 డివిజన్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా ఎర్ర నాగేష్ ఎన్నికయ్యారు. సేవా యూత్ అసోసియేషన్ భవన్‌లో జిల్లా కో-ఇన్‌చార్జ్ ఎర్రమౌని యాదగిరి సమక్షంలో, మండల ఇన్‌చార్జి రాచమల్ల యాదగిరి ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. ప్రధాన కార్యదర్శిగా వేల్పుగొండ పరశురాములు, కార్యదర్శిగా గ్యార మహేష్, ఉపాధ్యక్షులుగా ఎర్ర సైదులు, బరపటి సైదులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు ఎర్ర యాకన్న, తిరుపతి, ఎర్ర వీరన్న, సలోని పాల్గొన్నారు. అలాగే ఎంఎస్పీ డివిజన్ అధ్యక్షుడిగా మిరియాల లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శిగా నరాల వీరస్వామి, అధికార ప్రతినిధిగా ఈదుల నరేష్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు నాగేష్ జాతి సేవకు కృషి చేస్తానన్నారు.
ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*
