విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానం సందర్భంగా సెప్టెంబర్ 26 – 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళల జాతర జరుపుకుందాం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF) తెలుగు ఉభయ రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు ప్రజాగాయని విమలక్క జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం సమావేశమయింది. ఈ సందర్భంగా దేశంలో పెచ్చరిల్లుతున్న సామ్రాజ్యవాద, మనువాద సంస్కృతి పట్ల రాష్ట్ర కార్యవర్గం ఆందోళన ప్రకటించింది.సెప్టెంబర్ 26 – 28 తేదీల్లో జరిగే 50 గంటల కార్యక్రమంలో అందరూ భాగం కావాలని ఆహ్వానిస్తున్నాం. ప్రజా విప్లవ గళంగా విమలక్క 50 ఏళ్లుగా సాగిస్తున్న సాంస్కృతికోద్యమ కర్తవ్యాలను ఎత్తి పడుతూ ప్రజాకళల జాతర జరుపుకుందాం. ప్రజా కళలను, ప్రజా సంస్కృతిని కాపాడుతూ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ నిర్మాణానికి కలిసి నడుద్దాం.విమలక్క 50 ఏళ్ల సాంస్కృతికోద్యమ ప్రస్థానం సందర్భంగా 2026 సెప్టెంబర్ 26-28 తేదీల్లో 50 గంటల పాటు హైదరాబాద్‌లో ప్రజాకళల జాతర జరుపుకుందాం. నేటి నుండి 50 రోజుల తర్వాత జరిగే 50 గంటల కార్యక్రమంలో సైతం అందరూ భాగం కావాలని ఆహ్వానిస్తున్నాం. విప్లవాభినందనలతో మల్సూర్ (అధ్యక్షుడు)రమేష్ పోతుల (ప్రధాన కార్యదర్శి)
విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానం
