భారత త్రివర్ణ పతాకం మన గర్వకారణమని, దేశం కోసం ఉత్తమంగా పనిచేసేలా నిరంతరం స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో మనందరి భాగస్వామ్యం అవసరమని, అందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రగతి కోసం ప్రతిజ్ఞను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.
ఈ ఏడాది ‘వందేమాతరం’ గీతానికి ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ కార్యక్రమం చేపట్టడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
