శ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలు* నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 20 (గ్రామ దండోరా న్యూస్) శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా చివరి రోజైన మండపారాధనలు, కలశార్చనలు, జపానుష్ఠానాలు, విశేష కుంకుమార్చనలు, ఉపాంగహవనములు చండీహోమం, రుద్ర హోమం, జయాదిహోమాలు నిర్వహించబడ్డాయి. *పూర్ణాహుతి* ఉత్సవాలలో భాగంగా శ్రీ అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, శ్రీ స్వామివారి యాగశాల నందు రుద్రయాగపూర్ణాహుతి నిర్వహించబడ్డాయి. తరువాత కలశోద్వాసన కార్యక్రమాలు జరిపించబడ్డాయి. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధద్రవ్యాలు, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించడం జరిగింది. కార్యక్రమములో భాగంగా చండీయాగ, రుద్రయాగ ప్రధానకలశ పుణ్యజలాలను శ్రీస్వామిఅమ్మవార్లకు సమర్పించడం జరిగింది. తరువాత మల్లికాగుండం వద్ద చండీశ్వరస్వామివారికి అవభృథ స్నానం జరిపించబడింది. అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో వేదగోష్టి నిర్వహించారు. కాగా శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో మొట్టమొదటిసారిగా లోకకల్యాణం కోసం సహస్రచండీ పారాయణ పూర్వక శతచండీ మరియు మహారుద్రయాగం నిర్వహించబడింది. ఈ కార్యక్రమములో పాల్గొన్న ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్కులకు శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డు ప్రసాదాలతో సత్కరించారు. ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీపోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీయం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఎ.వి. రమణ, శ్రీమతి కోడే కాంతివర్ధిని, శ్రీ చిలువేరు కాశీనాథ్, శ్రీ మేడా మురళీధర్, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కారుపర్తి నాగమల్లేశ్వరరావు, శ్రీ ఆకుల శ్రీనివాసులు పాల్గొన్నారు. *శ్రీ భ్రమరాంబాదేవి అలంకారం* శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలలో చేయబడుతున్న అలంకారాలలో భాగంగా శ్రీఅమ్మవారిఉత్సవమూర్తిని శ్రీభ్రమరాంబాదేవిస్వరూపంలో(నిజాలంకరణ) అలంకరింప జేయడంజరుగుతుంది. అష్టభుజాలు కలిగిన ఈ దేవి శూలం, బాకు, గద, ఖడ్గం, విల్లు, డాలు, పరిఘ మొదలైన ఆయుధాలను ధరించి దర్శనమివ్వనున్నారు *నందివాహనసేవ* ఈ ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా నందివాహనసేవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, నందివాహనంపై వేంచేపు చేయించి పూజాదికాలను నిర్వహించబడుతాయి.*శమీపూజ* విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని శమీ వృక్షానికి శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడుతాయి. ఈకార్యక్రమములో భాగంగా ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనముపై శమీవృక్షము వద్దకు తోడ్కొని రావడం జరుగుతుంది. తరువాత శమీవృక్షము వద్ద ప్రత్యేకపూజలు జరిపించబడుతాయి.
శ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలు
