పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముదిరాజులను తక్షణమే బీసీ ఏ లో చేర్చేందుకు పండుగ సాయన్న ముదిరాజ్ స్ఫూర్తితో మరో ఉద్యమానికి ముదిరాజుల సిద్ధం కావాలని మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ పిలుపునిచ్చారు ఈ మేరకు గురువారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో ఉన్న పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలవేసి అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు .ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధ్యక్షత వహించగా అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్ ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ లు పాల్గొన్నారు ప్రజా తెలంగాణ కోసం పోరాడినయోధుడని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ దళాన్ని ఏర్పాటు చేసి పెద్దలను దోచి పేదోళ్లకు పంచి అందరి మనుషులను దోచుకున్నాడని ఇది సహించలేని నిజాం ప్రభువు ఆయనను పాశవికంగా హత్య చేసి సంబరాలు జరుపుకోవడం ఒక చీకటి అధ్యాయం అని ఆయన పేర్కొన్నారు పాలమూరు జిల్లా నవాబ్‌పేట మండలం మెరుగొని పల్లి లో జన్మించిన ఆయన చిన్నతనం నుండి చురుకైన వ్యక్తిత్వం కలవాడని ఆయన జరిపిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి సైతం స్ఫూర్తి నిచ్చిందని శివయ్య పేర్కొన్నారు పండుగ సాయన్న ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణలో ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి ముదిరాజ్ సామాజిక వర్గం ముందుకు రావాలని ముఖ్యంగా గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో నంబర్ 15 ప్రభుత్వం యధావిధిగా అమలు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు కాగా రవీంద్ర భారతి వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనమల రేవంత్ రెడ్డి ముదిరాజులను బీసీ డీ నుండి బీసీఏలో చేర్చడానికి త్వరలోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఒక కమిటీని వేస్తానని ప్రకటించడం హర్షనీయమన్నారు గత అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల పట్ల ఉన్న వైఖరిని కొంచెం మార్చుకొని ముదిరాజుల అభివృద్ధికి తోడ్పాటున అందించడం పట్ల ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు పండుగ సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమంలో అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శంకర్ ముదిరాజ్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముదిరాజ్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కాసాని వీరేశం ముదిరాజ్, మెదక్ కాంటెస్ట్ ఎంపీ నీలం మధు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమ లక్ష్మణ్ ముదిరాజ్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్ యువజన నాయకులు అల్లుడు జగన్ గుండ్లపల్లి శీను, యాదగిరి ముదిరాజ్ ఉప్పరి నారాయణ ముదిరాజులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవగానే వారం రోజుల వ్యవధిలోని జీవో జారీ చేయడం ఎంతో గొప్ప శుభపరిణామం అని అన్నారు. ముదిరాజుల అభివృద్ధి కోసం రాష్ట్రప్రభుత్వం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ పదవిని కేటాయించడంతోపాటు వివిధ కార్పొరేషన్లకు చైర్మన్‌గా ముదిరాజులను నియమించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అదిలాబాద్ పట్టణంలోని గాంధీ పార్కులో ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కోసం ఐదేకరాల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని, అదేవిధంగా పట్టణంలో పండ్లు కూరగాయలు అనుకుంటున్నా ముదిరాజ్ మహిళలకు ప్రత్యేక మార్కెట్ సౌకర్యం కల్పించాలని, ముదిరాజ్ మత్స్యకారులకు మార్కెట్ సొసైటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎంపీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత కోలీ సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు బొజ్జ నారాయణ ముదిరాజ్ ,పట్టణ అధ్యక్షులు ధారవేణి రాము ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి దార్శ రవి ముదిరాజ్ కోశాధికారి బొజ్జ సంతోషము ముదిరాజ్ ఉపాధ్యక్షులు స లేంద్ర రాజు ముదిరాజ్ బొమ్మెన లక్ష్మన్న ముదిరాజ్, పోచ్చన్న ముదిరాజ్, దార్ష శ్రీనివాస్ ముదిరాజ్ ,దాసరి రాము ముదిరాజ్ ఇండ్ల గణేష్ ముదిరాజ్ ,జిల్లా ఉపాధ్యక్షులు కుమారి మాజీ సర్పంచ్ మందుల రమేష్ ముదిరాజ్ వడూరు గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ ముదిరాజ్ బరంపూర్ గ్రామానికి చెందిన యువ నాయకుడు మడూరి రమాకాంత్ ముదిరాజ్ పాట్నా నర్సయ్య,ముదిరాజ్ బోథ్ నియోజకవర్గానికి చెందిన నాయకులు జే , భోజన్న, భోజరాజు జెట్టి రాజేశ్వర్ సున్నపు శ్రీనివాస్ నాయుడు శ్రీనివాస్ తో పాటు దేవాపూర్ కు చెందిన నరేష్ నాయిని నవీన్ దశరథ్ గోనెల స్వామి శ్రీకాంత్ లచ్చన్న, ఇతర కులబోయుల్లు ఉన్నారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు పాలు సమస్యలపై వినతి పత్రాన్ని సలేందర్ శివయ్య ముదిరాజ్ తదితరులు అందజేశారు.
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్
