28, 29, 30 తేదీలలో హనుమకొండలో జరుగు AISF 90 వసంతాల రాష్ట్రస్థాయి ముగింపు వారోత్సవా సభలు జయప్రదం చెయ్యండి. AISF రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపు.1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆవిర్భవించిన AISF, దేశ స్వాతంత్ర్యోద్యమం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. “చదువుతూ పోరాడుతాం – చదువుకై పోరాడుతాం” అనే నినాదంతో విద్యార్థి సమస్యల పరిష్కారానికి AISF కృషి చేస్తోందన్నారు.ప్రస్తుతం విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యా రంగానికి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం–2020ను పునఃసమీక్షించి విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణమైన విద్యా విధానాన్ని రూపొందించాలని కోరారు.తెలంగాణలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.AISF హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ,600 మంది ప్రతినిధులతో రాష్ట్రస్థాయి వారోత్సవ మహాసభలు సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో జరిగే మూడు రోజుల కార్యక్రమాలకు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా AISFలో పనిచేసిన మాజీ నాయకులు, ప్రస్తుత నాయకులు పాల్గొంటారని మొదటిరోజు భారీ ర్యాలీ బహిరంగ సభ, రెండవ రోజు మూడవ రోజు వారోత్సవ మహాసభలు జరగనున్నట్లు డెలిగేట్స్ అందరికీ మూడు రోజులపాటు వసతి, భోజనం, కాన్ఫరెన్స్ హాల్ తదితర సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ సమావేశంలో విద్యారంగ సమస్యలు పరిష్కార మార్గాలు ఏఐఎస్ఎఫ్ సంఘ నిర్మాణం భవిష్యత్తు ఉద్యమాలపై పలు కీలకమైన నిర్ణయాలు జరగనున్నట్లు తెలిపారు.AISF తొమ్మిది దశాబ్దాల పోరాట చరిత్రను స్మరించుకోవడంతో పాటు, ప్రస్తుత విద్యారంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ విద్యార్థి ఉద్యమానికి నూతన కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.AISF 90వ వార్షికోత్సవాల ముగింపు ఉత్సవాలు, రాష్ట్రస్థాయి మహాసభలను విజయవంతం చేసేందుకు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు, యువత, ప్రజలు తమ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్, శ్రీపతి వినయ్, వేల్పుల చరణ్, జిల్లా నాయకులు కే అజయ్, నాగరాజు, వంశీ, రాజు, శ్రావణ్, ముఖేష్, లతోపాటు తదితరులు పాల్గొన్నారు.విప్లవాభివందనాలతో,AISF హనుమకొండ జిల్లా సమితి.ఊట్కూరి ప్రణీత్ గౌడ్జిల్లా అధ్యక్షులుCell:- 86867 27298.భాషబోయిన సంతోష్జిల్లా ప్రధాన కార్యదర్శిCell:- 8106551545.
AISF 90 వసంతాల రాష్ట్రస్థాయి ముగింపు వారోత్సవా
