వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుమియాపూర్:-హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో 60 ఏళ్ల అరవపల్లి శ్రీనివాసరావుపై కుటుంబ సభ్యులు దాడి చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కుమారుడు రామకృష్ణ కిషోర్‌తో విభేదాల నేపథ్యంలో గతంలో తనను కొట్టి రోడ్డుపై వదిలేశారని, ఇంటికి వస్తే చంపేస్తామని బెదిరించారని శ్రీనివాసరావు ఆరోపించారు. సెప్టెంబర్ 10న ఇంటికి వెళ్లగా కుమారుడు, భార్య పద్మావతి, కుమార్తె తేజస్వి, అల్లుడు మల్లేశ్వరరావు, కోడలు, బీహార్‌కు చెందిన డ్రైవర్ అమిత్, మరో 25 మంది, కిషోర్ మేనేజర్ సాయి తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన తనను ఆస్పత్రిలో చేర్చి వెళ్లిపోయారని తెలిపారు. రెండు సెల్ఫోన్లు, 30 గ్రాముల బంగారం, రూ.1.20 లక్షల నగదు, కోర్టు పత్రాలు తీసుకెళ్లారని ఆరోపించారు. సెప్టెంబర్ 11న అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు.
వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదు
