అక్రమ నిర్మాణాలకు అధికారుల అండ ?
వార్తా పత్రికల్లో వరుస కథనాలు.
స్పందించని “టౌన్ ప్లానింగ్”..!
నోటీసుల పేరుతో కాలయాపన
నవ్వి పోడూరు గాక మాకేటి సిగ్గు … ఇదీ అధికారుల తీరు
పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా, జనం కోడై కూస్తున్న , వాళ్ళ కళ్ళకు కనిపించవు, చెవులకు వినిపించవు. మరి అక్రమ నిర్మాణాలు ఏమయినా నిర్మణానుష్యప్రాంతాల్లోనో, చెట్లు, పుట్టల మాటునో సాగుతున్నాయా … అంటే అదీలేదు.. నిత్యం జనం తీరుగాడే చోట, రక్షక భట నిలయం సమీపంలో , పాఠశాలు, బ్యాంకుల సమీపంలో అక్రమ నిర్మాణాలు సాగుతున్న స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోరు. వాళ్ళ పై అధికారులకు ఇవేమి పట్టవు. అదేదో సినిమాలోజెప్పినట్లు .. ఆఫీసుకు వచ్చామా, సంతకం పెట్టామా .. టైం కాగానే వెళ్ళిపోయామా… అదేనండి.. తిన్నామా.,. పడుకున్నామా.. తెల్లారిందా .. అన్నట్లు ఉంది. దుండిగల్ మున్సిపల్ అధికారుల తీరు. ఇక స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం వచ్చామా.. అక్రమ నిర్మాణదారు వచ్చి కలిశాడా.. ముడుపులు ముట్ట చెప్పాడా… అన్నట్లు ఉంది. తమకు అందాల్సిన ముడుపులు అందితే చాలు.. జనం ఏమయితే ఏందీ? నిబంధనలు మూసీలో కలిస్తే ఏందీ? ప్రభుత్వ ఖజానాకు గండి పడితే ఏందీ? తమ జేబులు నిండితే చాలు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నిర్మించుకోవచ్చు. సాంకేతిక పరమైన సమస్య తలెత్తినప్పుడు మాత్రం హడావిడి… నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇదీ సంక్షిప్తంగా దుండిగల్ సిర్కిల్ పరిదిలోని గండి మైసమ్మ ప్రాంతం పరిస్థితి. కాదు కాదు దుస్థితి.
కుత్బుల్లాపూర్ జోన్ దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండిమైసమ్మ పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ భారీ షెడ్లను నిర్మిస్తున్నారు… నిర్మాణాలు జరుగుతున్న, ఫిర్యాదులు అందుతున్న సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు..గండి మైసమ్మ – మేడ్చల్ కు వెళ్లే రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కన, స్థానిక ఎస్బిఐ బ్యాంకు వెనుకాల, దుండిగల్ పీఎస్ వెనుకాల భారీ షెడ్డునిర్మాణం… ఇలా దుండిగల్ సర్కిల్ 59 లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా అడిగే నాధుడేలేడు. అక్రమ నిర్మాణాలను సంబంధిత అధికారులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గండి మైసమ్మలోని ప్రగతి స్కూల్ పక్కన పక్కన అక్రమ నిర్మాణం

గణేష్ నగర్ లో సెట్ బ్యాక్ లు లేకుండా పక్కన అక్రమ నిర్మాణం

గండి మైసమ్మ ఎస్బిఐ బ్యాంకు వెనుకాల పక్కన అక్రమ నిర్మాణం

ఎస్బిఐ బ్యాంకు వెనుకాల పక్కన అక్రమ నిర్మాణం


దుండిగల్ పీఎస్ వెనుకాల భారీ షెడ్డు పక్కన అక్రమ నిర్మాణాలు

గండి మైసమ్మ – మేడ్చల్ కు వెళ్లే రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ పక్కన అక్రమ నిర్మాణం
దుండిగల్ మున్సిపల్ సర్కిల్‌లో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలు మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది వ్యవహారశైలి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సెలవు దినాలను ఆసరాగా చేసుకుని అనధికార కట్టడాలు చేయడం, కూల్చివేసినా మళ్లీ నిర్మాణాలు చేపట్టడం వంటి ఘటనలు జరుగుతున్నాయి.అక్రమ నిర్మాణాల తీరుఅనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు… సెల్లార్ల నిర్మాణం.. .మున్సిపల్ అధికారులు కూల్చివేసినా వెనక్కి తగ్గకుండా రాత్రికి రాత్రే షెడ్లు, భవనాల పునరుద్ధరణ… టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉదాసీనత మరియు లంచాల ఆశతో అనధికార కట్టడాలకు పరోక్ష పరోక్ష సహకారానికి అడ్డం పడుతున్నాయి.
గండి మైసమ్మలోని ప్రగతి స్కూల్ పక్కన.. గణేష్ నగర్ లో సెట్ బ్యాక్ లు లేకుండా నిర్మాణం…ఎస్బిఐ బ్యాంకు వెనుకాల.. దుండిగల్ పీఎస్ వెనుకాల భారీ షెడ్డు.. … ఇలా ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే…!ఒక్క మాటలో చెప్పాలంటే.. దుండిగల్ సర్కిల్… అక్రమ నిర్మాణాలకు అడ్డగా .. మారిపోయింది! అవేమయినా గుట్టుగా సాగుతున్నాయా అంటే.. అదేమీ లేదు.. జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో ! ఎస్.బి.ఐ , పోలీస్ స్టేషన్, ప్రగతి స్కూల్.. జనం రాకపోకలు సాగించే ప్రముఖ ప్రాంతాల్లో .. !ఇంతబహిరంగంగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటే, టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించడం లేదా? .. అయ్యోరామా? ఎంతమాట…వాళ్లకు ఇలాంటివి కనిపించవు.. వాళ్ళ కళ్ళకు అక్రమార్కులు అందించే ముడుపుల మూటలు మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళ కళ్ళకు ముడుపులస గంతలు కట్టుకుంటారు.
దుండిగల్‌లో ఇటీవల ఓ వ్యక్తి అక్రమ నిర్మాణానికి తెగబడ్డాడు. మున్సిపల్ అధికారులు కూల్చివేసిన భారీ షెడ్డును గంటల వ్యవధిలోనే తిరిగి నిర్మించడం సంచలనంగా మారింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఈ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకున్నా, ఆ వ్యక్తి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పనులు ప్రారంభించాడు. సెలవు రోజులను అదునుగా చేసుకుని, అధికారులకు సవాల్ విసిరాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మరుణా సంగతి తెలిసిందే! పేద ప్రజలు చిన్న గూడు నిర్మించుకుంటేనే అనుమతుల పేరుతో కూల్చివేస్తూ నానా హంగామా చేసే అధికారులు, కళ్ల ముందరే అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా పట్టించుకోవడంలేదు. దీంతో అధికారులే అక్రమ నిర్మాణాల వెనుక ఉండి నడిపిస్తున్నారనేది తేటతెల్లమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమ నిర్మాణాలను నిలువరించాల్సిన వారే ప్రోత్సహిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండిపడక మరేం జరుగుతుందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే పలువురు కిందిస్థాయి సిబ్బంది చేతివాటం కారణంగానే కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు, అనుమతి లేని నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికులు స్పష్టం చేస్తున్నారు
