నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీ సమీపంలోని ఒక ప్రైవేట్ స్థలంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు.
అయితే, విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదనే కారణంతో మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే విగ్రహం ఉంచాల్సిన గద్దెను కూల్చివేశారు. ఈ చర్యపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గద్దె కూల్చివేసిన ప్రాంతం వద్ద ఆందోళన చేపట్టేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు.
