*ప్రతి ఇంటిమీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేద్దాం**దేశభక్తిని చాటుదాం: రామకోటి రామరాజు**భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మనదేశం*స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ జాతీయ జెండాలను ఎగరవేయాలని బుధవారం నాడు జాతీయ జెండాలను ఆవిష్కరించి పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముచ్చటైన మన మూడు రంగుల జెండాను మన ఇంటి పై ఎగరవేసి ప్రతి ఒక్కరూ దేశ భక్తిని చాటాలన్నారు. ప్రతి వ్యక్తిలోనూ దేశభక్తి ఉప్పొంగాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మనదేశం ప్రతీక అన్నారు. సర్వ మతాలకు మన భారతదేశం పుట్టినిల్లు అన్నారు.
ప్రతి ఇంటిమీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేద్దాం
