*నల్లని ఉలవలతో నాగదేవత అపురూప చిత్రం**రామకోటి రామరాజు వినూత్న ఆవిష్కరణ**పండుగ పర్వదినాలలో ప్రత్యేక చిత్రాలను ఆవిష్కరిస్తున్న రామకోటి సంస్థ*హిందువుల పవిత్రమైన నాగుల పంచమి పురస్కరించుకొని వినూతన ఆలోచనతో శివ లింగం నాగ దేవత చిత్రాలను నల్లని ఉలువలను ఉపయోగించి అత్య అద్భుతంగా చిత్రాన్ని రూపొందించి సోమవారం రోజు ఆవిష్కరించి భక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతు భక్తిశ్రద్ధలతో మహిళలు ఉదయమే గుడికి వెళ్లి నాగదేవతకు పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారన్నారు. శ్రావణమాసం ఆధ్యాత్మికతకు నిలయం అన్నారు. ప్రకృతిలో లభించే సాధారణ పదార్థాలతో కూడా భక్తి భావాన్ని ప్రతిబింబించే అద్భుతమైన కళారూపాలను రూపొందించవచ్చని రామకోటి రామరాజు తన వినూత్న ప్రయత్నం ద్వారా చాటిచెప్పారు.
నల్లని ఉలవలతో నాగదేవత అపురూప చిత్రం**రామకోటి రామరాజు వినూత్న ఆవిష్కరణ
