*వరుస తప్పిదాలతో విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ చెలగాటం* *ఏఐఎస్ఎఫ్ 90వ రాష్ట్రస్థాయి వార్షికోత్సవాలు జయప్రదం చేయండి.* *ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు*హనుమకొండ : వరుస తప్పిదాలతో విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ చెలగాటం ఆడుతున్నదని ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ అధ్యక్షతన బాలసముద్రం జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ జాతీయ అధ్యక్షులు తక్కలపల్లి శ్రీనివాసరావు హాజరై మాట్లాడుతూ జూన్ లో జరిగిన యుజిసి నెట్ ప్రవేశ పరీక్షలో తప్పులు,లోపాలు జరిగి, ఇంగ్లీష్, సోషియాలజీ, కామర్స్ పేపర్ లను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించడం అంటే విద్యార్థుల జీవితాలతో చెలగటమేనని, నీట్ పేపర్ లీక్,పరీక్షల్లో అవకతవకలు మొదలుకొని నేటి యుజిసి నెట్ ప్రశ్న పత్రాల తప్పులు,లోపల వరకు ఎన్టీఏ పరీక్షల నిర్వహణ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వుందని,వరుస వైఫల్యాలతో NTA లో జరుగుతున్న అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.వరుస తప్పిదాలతో ఎన్టీఏ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని, దీంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని , ఎన్టీఏ అధికారులు చేస్తున్న తప్పులకు విద్యార్థులు బలి అవుతున్నారని, ఎన్టిఏ సంస్థ నిత్యం పరీక్షల నిర్వహణలో తప్పులు చేస్తూ అవకతవకలు, అక్రమాలు చేస్తూన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఒక సంస్థను రద్దు చేయడానికి చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు.బిజెపి ప్రభుత్వానికి ఒక ఎన్టిఏ సంస్థ ముఖ్యమా లేక దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించాలని, ప్రధాని మోదీ వెంటనే దీనిపై స్పందించాలని, కొన్ని పరీక్షల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో కాకుండా రాష్ట్రాలకు కూడా ఇవ్వాలని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య — ఏఐఎస్ఎఫ్ 90 వసంతాల ప్రస్థానంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సెప్టెంబర్ 28,29,30 తేదీలలో హనుమకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వార్షికోత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, దేశ ఐక్యత, శాంతి కోసం నిరంతరం పోరాడిన చారిత్రక విద్యార్థి సంఘం అని, 1936లో ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అనేక తరాల విద్యార్థులను ఉద్యమ బాటలో నడిపించిన ఘనమైన చరిత్ర ఏఐఎస్ఎఫ్‌కు ఉందని అన్నారు. విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలి, పేద విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి అనే లక్ష్యాలతో ఏఐఎస్ఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. 90 సంవత్సరాల ఈ ప్రస్థానం సందర్భంగా గత పోరాటాలను స్మరించుకోవడం, ఆ పోరాటాల స్ఫూర్తిని నేటి తరానికి అందించడం, భవిష్యత్ విద్యార్థి ఉద్యమానికి దిశానిర్దేశం చేయడం ఈ వార్షికోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు కర్రె బిక్షపతి గారు మాట్లాడుతూ ప్రస్తుతం విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని,పెరుగుతున్న విద్యా వ్యయం, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగం, ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలు వంటి అంశాలపై విద్యార్థుల తరఫున మరింత బలమైన ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ 90 వసంతాల వార్షికోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులను కోరుతున్నామన్నారు. అందుకే ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఈ చారిత్రక కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దిడ్డి పార్థసారథి, యాదల్ల శరత్, జిల్లా ఉపాధ్యక్షులు జక్కుల భాను ప్రసాద్, శ్రీపతి వినయ్, వేల్పుల చరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కొండ చరణ్, బన్నీ, చిర సాయి, జిల్లా సమితి సభ్యులు కందగట్ల అజయ్, మల్లబోయిన రామ్ చరణ్, గుండేల్లి అవినాష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
వరుస తప్పిదాలతో విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ చెలగాటం* *ఏఐఎస్ఎఫ్ 90వ రాష్ట్రస్థాయి వార్షికోత్సవాలు జయప్రదం చేయండి.* *ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
