జి ప్లస్ టు అనుమతులు.. జి ప్లస్ సిక్స్ 6 నిర్మాణం!రోడ్ నెంబర్ 3, ప్లాట్ నెంబర్ 466లో నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణం?అనుమతులు రెండు అంతస్తులకేనా? నిర్మాణం మాత్రం ఐదు అంతస్తులకా?రోడ్ నెంబర్ 3, ప్లాట్ నెంబర్ 466 వద్ద కొనసాగుతున్న నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారుల నుంచి జి+2 (గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తులు)కు మాత్రమే అనుమతులు తీసుకుని, ప్రస్తుతం జి+5 (గ్రౌండ్ ప్లస్ ఐదు అంతస్తులు) నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.నిర్మాణం భారీ స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటున్నారా? అనుమతించిన ప్లాన్‌కు మించి నిర్మాణం జరుగుతుంటే అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జి+2 అనుమతులు.. జి+5 నిర్మాణం నిజమే అయితే ఇది భవన నిర్మాణ అనుమతులపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, ఆమోదిత ప్లాన్, వాస్తవ నిర్మాణాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.అధికారుల తనిఖీ ఎప్పుడు?అనుమతికి మించి నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు జి+2కే పరిమితమైతే.. జి+5 వరకు నిర్మాణం ఎలా సాగుతోంది? అనే ప్రశ్నకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.గ్రామ దండోరా ప్రత్యేక కథనం — వాస్తవాలు అధికారుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.
జి ప్లస్ టు అనుమతులు.. జి ప్లస్ సిక్స్ 6 నిర్మాణం!రోడ్ నెంబర్ 3, ప్లాట్ నెంబర్ 466లో
