*ACP ఉత్తమ సేవలకు ప్రతిష్ఠాత్మక అవార్డు గర్వకారణం**భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు**రామకోటి సంస్థ ఆధ్వర్యంలో ACP కి ఘన సన్మానం*స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన గజ్వేల్ ఏసీపీ (ACP) గారికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించడం గజ్వేల్ పట్టణ ప్రజలకు, పోలీస్ శాఖకు గర్వకారణమని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఏసీపీకి సీతారాముల ఫొటో అందజేసిన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న ఏసీపీ కి ఈ అవార్డు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. పోలీస్ శాఖలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసే అధికారులను సమాజం ఎల్లప్పుడూ గౌరవించాలని పేర్కొన్నారు.ఈ అవార్డు గజ్వేల్ ప్రాంతానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందన్నారు.
ACP ఉత్తమ సేవలకు ప్రతిష్ఠాత్మక అవార్డు గర్వకారణం**భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు*
