*కేపీహెచ్బీలో రోడ్డుపై అపస్మారక స్థితిలో వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.*కేపీహెచ్బీ ధర్మారెడ్డి కాలనీలో రోడ్డుపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడు.ఆగస్టు 4న ఉదయం 9 గంటల నుంచి కేపీహెచ్బీ కాలనీ బ్లూ కల్ట్-01 విధుల్లో ఉన్న పోలీసులకు మధ్యాహ్నం 3:46 గంటల సమయంలో రోడ్ నంబర్-1 వద్ద ఓ వ్యక్తి చాలాసేపటి నుంచి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు సమాచారం అందింది.వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని గుర్తించారు. 108 అంబులెన్స్ ద్వారా చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.స్థానికులను విచారించగా.. ఆ వ్యక్తి కొంతకాలంగా దుకాణాల వద్ద భిక్షాటన చేస్తూ, రాత్రివేళ షట్టర్ల వద్ద నిద్రిస్తున్నట్లు తెలిసింది. సకాలంలో ఆహారం అందకపోవడం, చలి, వర్షాన్ని తట్టుకోలేక ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.ఈ ఘటనపై ఆగస్టు 19న ఉదయం 9:20 గంటలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేపీహెచ్బీలో రోడ్డుపై అపస్మారక స్థితిలో వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు.*
