బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
తెలంగాణ

ఏపీఎస్ఆర్టీసీ బస్సుల అడ్డగింపుప్రయాణికులను అడవిలో వదిలేయడం దారుణం:

ఏపీఎస్ఆర్టీసీ బస్సుల అడ్డగింపుప్రయాణికులను అడవిలో వదిలేయడం దారుణం:

సుండిపెంటను విస్మరిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల అడ్డగింపుప్రయాణికులను అడవిలో వదిలేయడం దారుణం: నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు ఆగస్టు 10( గ్రామ దండోరా న్యూస్ )ఏఐటీయూసీ, సీపీఐ ఆగ్రహంపద్ధతి మార్చుకోకపోతే ప్రజలతో కలిసి భారీ ఆందోళన: కె. నాగిరెడ్డి హెచ్చరికసుండిపెంట, వివిధ ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మండల కేంద్రమైన సుండిపెంటలోకి రాకుండా నేరుగా వెళ్లిపోవడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ, కర్నూలు, ఒంగోలు, మార్కాపురం తదితర ప్రాంతాల నుండి వచ్చే బస్సులు సుండిపెంటకు వచ్చే ప్రయాణికులను వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా అటవీ ప్రాంతమైన ముఖద్వారం వద్ద దించివేసి శ్రీశైలం వెళ్లిపోతున్నాయి.దీనిని తీవ్రంగా పరిగణించిన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కె. నాగిరెడ్డి, సీపీఐ కార్యదర్శి పి. పులిరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6:30 గంటలకే సుమారు 25 మంది నాయకులు, కార్యకర్తలు ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. నేరుగా శ్రీశైలం వెళ్తున్న పలు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను అడ్డగించి, వాటిని సుండిపెంట మీదుగా వెళ్లేలా చేశారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కె. నాగిరెడ్డి మాట్లాడుతూ.. సుమారు 30,000 జనాభా నివసిస్తున్న సుండిపెంట గ్రామ ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మాత్రమే ఏకైక మార్గమన్నారు. అయితే, అటు శ్రీశైలం వెళ్లే బస్సులు కానీ, ఇటు శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణంలో వచ్చే బస్సులు కానీ సుండిపెంటలోకి రాకుండా ముఖద్వారం మీదుగా నేరుగా వెళ్లిపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.బస్సులు గ్రామంలోకి రాకపోవడం వల్ల ముఖ్యమైన పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, అనారోగ్య సమస్యలతో బయటి ప్రాంతాల ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వివిధ పనుల నిమిత్తం ప్రయాణించే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన మండిపడ్డారు.డిమాండ్లు & హెచ్చరిక:ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు మరియు అన్ని డిపోల మేనేజర్లు వెంటనే స్పందించి, బస్సులన్నీ తప్పనిసరిగా సుండిపెంట మీదుగానే వెళ్లేలా తమ డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రయాణికులను ముఖద్వారం వద్ద వదిలేసే ఈ సమస్య ఇలాగే కొనసాగితే, సుండిపెంట గ్రామ ప్రజలందరినీ ఏకం చేసి ముఖద్వారం వద్ద భారీ స్థాయి నిరసన కార్యక్రమం చేపడతామని ఉన్నతాధికారులను హెచ్చరించారు.ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సుమారు 25 మంది పాల్గొన్నారు

పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]