మూసాపేట డివిజన్ అధ్యక్షులు తూము సంతోష్ ఆధ్వర్యంలో *నేతాజీ సుభాష్ చంద్రబోస్* వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ *బండి రమేష్* ఈ కార్యక్రమంలో పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. భారత స్వతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, యువతని స్వాతంత్ర పోరాటం వైపు నడిపించడానికి ఆయన కృషి చేశారని, తన వ్యూహరచనలతో ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి బ్లాక్ అధ్యక్షులు, తూము వేణు, నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల జస్వంత్ రావు ( దేశాల్ ), సీనియర్ నాయకులు కర్కే పెంటయ్య, ఖైత్లపూర్ డివిజన్ అధ్యక్షులు శంకర్ , యూత్ కాంగ్రెస్ సలీం, సీనియర్ నాయకులు నారాయణ , వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ , తోటరాజు, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట డివిజన్ అధ్యక్షులు తూము సంతోష్ ఆధ్వర్యంలో *నేతాజీ సుభాష్ చంద్రబోస్* వర్ధంతి
