జగద్గిరిగుట్టలో 22 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం———————————————– జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక కార్యకలాపాల బృందం(SOT) కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా మహాదేవపురం, జగద్గిరిగుట్ట నందు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహిళలతో సహా,నలుగురు నిందితులను పోలీసులు ఆరెస్టు చేసారు. అధే విధంగా అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 22 కిలోల గంజాయి చాక్లెట్స్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నలుగురిలో కూకట్పల్లి , ఎల్లమబండకు చెందిన బురానీ కమల్ సింగ్, రోడమెస్ట్రీ నగర్ కు చెందిన భద్దా నేపాల్ సింగ్, భద్దా దీపక్ సింగ్, హారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్‌కు చెందిన జ్యోతి కౌర్ అనే మహిళ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, గంజాయి చాక్లెట్స్ లను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక మరెవరెవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ ..మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం మరియు వినియోగానికి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు.
జగద్గిరిగుట్టలో 22 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం
