
తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత శాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహాకాళి ఆలయం వద్ద పోలీసులు తనను అడ్డుకున్నారని, తమ పట్ల దురుసుగా వ్యవహరించారని జోగిని శ్యామల ఆమెకు వివరించారు.పోలీసుల తీరుపై జోగిని శ్యామల వ్యక్తం చేసిన ఆవేదనను కవిత విన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
