ఘనంగా రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలుకొండాపూర్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ శేరిలింగంపల్లి,గ్రామ దండోరా శేరిలింగంపల్లి తాజా మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ యువజన నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, దేవులపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మొదటగా రాగం నాగేందర్ యాదవ్ తో జన్మదిన కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా కొండాపూర్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో నిలిచే నాయకుడు రాగం నాగేందర్ యాదవ్ అని అన్నారు. ప్రతీ సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించడంతో పాటు శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గా రెండు సార్లు గెలిచి అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తున్నారన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాగం నాగేందర్ యాదవ్ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరి ఆశీస్సులు ఉండేలా ప్రతి ఏటా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఘనంగా రాగం నాగేందర్ యాదవ్ జన్మదిన వేడుకలుకొండాపూర్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ
