కాకతీయ యూనివర్సిటీ.*ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు**-పి.డి.ఎస్.యు.ఆధ్వర్యం లో “అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం”*ఆదివారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ముందు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, ఆదివాసి వీరులైన బీర్సా ముండా,కొమరం భీమ్ ల చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది.ఈ సందర్భంగా *పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి* మాట్లాడుతూభారత రాజ్యాంగం ఆదివాసీల రక్షణ కోసం కల్పించిన హక్కులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 78 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో ఆదివాసీల అభివృద్ధిని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రోడ్డు, బస్సు రవాణా సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు.*పి.డి.ఎస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబోలా అనిల్* మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ, ప్రభుత్వం కార్పొరేట్, పెట్టుబడిదారి వర్గాల ఆర్థిక ప్రయోజనాల కోసం ఆదివాసీలను అడవుల్లో నుండి వెళ్ళగొట్టే దుర్మార్గ పూరిత చర్యలకు ఒడిగడుతున్నారన్నారని తీవ్రంగా ఆక్షేపించారు. భారత రాజ్యాంగం లోని 5, 6 షెడ్యూల్, ఫెసా, 1/70, 2005 అటవీ హక్కుల చట్టాలను పగడ్బందీగా అమలు చేయడా నిర్వీర్యం చేసే కుట్రపూరిత విధానాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని అన్నారు. జల్- జంగిల్- జమీన్ కొరకై ఆదివాసి సమాజం కొనసాగించే పోరాటాలకు విద్యార్థుల పక్షాన పి.డి.ఎస్.యు. సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. ఆదివాసీలంతా తమ హక్కుల రక్షణ కోసం బిర్సా ముండా, కొమరం భీమ్, అల్లూరి, బాటన్న, లింగన్న లాంటి వీరుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, బి. నరేందర్,ఎస్.రాకేష్, దీక్షిత, రాష్ట్ర సహాయ కార్యదర్శులు డి. సురేష్,బుర్రా వీరభద్రం, బోయినపల్లి అజయ్, రాష్ట్ర కోశాధికారి అంగిడి కుమార్, రాష్ట్ర గర్ల్స్ కో-కన్వీనర్ పి.అనూష, రాష్ట్ర నాయకులు సీతారాం, సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ నాగరాజు,మారుతి, దండు వినయ్, వెంకటేష్, మహేష్, కిరణ్, శ్రావణ్, శశికిరణ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ.*ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
