పండుగ సాయన్న జయంతి, వర్ధంతికి అధికారిక గుర్తింపుసీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్‌కు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కృతజ్ఞతలుమహబూబ్‌నగర్: బహుజన ఆరాధ్య దైవం, పాలమూరు పోరాట యోధుడు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో ప్రకటించడం పట్ల తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు.పండుగ సాయన్నకు అధికారిక గుర్తింపు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముదిరాజ్ సమాజం ఆత్మగౌరవానికి చారిత్రాత్మక విజయమని ఆయన పేర్కొన్నారు. పండుగ సాయన్న చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని అన్నారు.ఈ సందర్భంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేసిన మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి కి, ముదిరాజ్ సమాజం తరఫున నిరంతరం కృషి చేస్తున్న ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ పుస్తక రచయితలు బిక్కం జనార్దన్ ఇందిరా దేవి కి పండుగ సాయన్న సేవా సమితి అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ కి మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆయన సేవలు, పోరాటం, త్యాగాలకు తగిన గౌరవం లభించిందని మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ముదిరాజ్‌లతో పాటు బహుజన సమాజానికి గర్వకారణమని ఆయన అన్నారు.
పండుగ సాయన్న జయంతి, వర్ధంతికి అధికారిక గుర్తింపుసీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్‌కు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కృతజ్ఞతలుమహబూబ్‌నగర్:
