*ఎస్.ఆర్.ఆర్.తోట ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బీ. రాజిరెడ్డి* *వరంగల్ జిల్లా ఆర్ ఆర్ తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వరంగల్ డిఎంహెచ్వో డాక్టర్ రాజిరెడ్డి సందర్శించారు.. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్.ఆర్.ఆర్.తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సేవల పర్యవేక్షణ, అందిస్తున్న వైద్య సేవలు అనగా వ్యాక్సినేషన్, ఏ.ఎన్.సీ క్లినిక్ వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి సమీక్షించారు.ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బి. రాజిరెడ్డి మాట్లాడుతూ.. రోగులకు అందుతున్న సేవలు, వైద్య రికార్డులు, ఔషధాల లభ్యత, మాతా – శిశు ఆరోగ్య సేవలు, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, యూ-విన్, ఎన్.సి.డీ, టీకా కార్యక్రమం తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని , హాస్పిటల్ స్టాఫ్ కు పలు సూచనలు అందించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలియజేశారు.జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వరంగల్ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ వైద్య ఆరోగ్యశాఖ నిరంతరం చర్యలు చేపడుతోందని డాక్టర్. రాజిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్.ఆర్ తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అనిత, నర్సింగ్ ఆఫీసర్ మంజుల, ఎల్.టి.మౌనిక, రామ రాజేష్ ఖన్నా , ఫార్మసీ ఆఫీసర్ నూకల అంజి యాదవ్, అకౌంటెంట్ శ్వేత, గూడెపు ప్రభాకర్ మరియు కృష్ణవేణి పాల్గొన్నారు….
ఎస్.ఆర్.ఆర్.తోట ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బీ. రాజిరెడ్డి* *వరంగల్ జిల్లా
