బ్రేకింగ్ న్యూస్
క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడిక్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌వృద్ధుడిపై దాడి ఆరోపణలుకొడుకు, కుటుంబ సభ్యులే దాడి చేశారని బాధితుడి ఫిర్యాదుహమారా ప్రసాద్ పుస్తకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్నాపై ఎంతో నమ్మకం ఉంచి, నాకు యువజన విభాగం డిస్టిక్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బాధ్యతలు అప్పగించిన వైయస్ జగన్జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగ అరెస్ట్ఎంఆర్పీఎస్ జగద్గిరిగుట్ట 280 డివిజన్ అధ్యక్షుడిగా ఎర్ర నగేష్*నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలి: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ఐదు కేసులు ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీసులునిందితుల అరెస్ట్ – 3.5 తులాల బంగారం మరియు రూ.10 లక్షల విలువైన బ్యాటరీల రికవరీజగద్గిరిగుట్ట పోలీస్అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ యస్ పార్టీ కో ఆర్డినేటర్ రెడ్డి సతీష్ అరోరాజూదం స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
తెలంగాణ

దామోదరపురం సమస్యలు ఇప్పుడే గుర్తొచ్చాయా?

దామోదరపురం సమస్యలు ఇప్పుడే గుర్తొచ్చాయా?

దామోదరపురం సమస్యలు ఇప్పుడే గుర్తొచ్చాయా? — జాతీయ బీసీ సంక్షేమ సంఘం సోంపేట ఆగస్టు 20 సోంపేట: 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గొల్లూరు గ్రామపంచాయతీ పరిధిలోని దామోదరపురం గ్రామ ప్రజలు రహదారి, స్మశానవాటిక, అంగన్వాడీ కేంద్రం, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అప్పటి ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఎందుకు కనిపించలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ లోకి నింది గోవిందరాజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడ్డు సోమశేఖర్ యాదవ్ ప్రశ్నించారు. వారు గురువారం నాడు ఈ విషయం మీడియాకు తెలిపారు దామోదరపురం ప్రజలు తమ సమస్యలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం దృష్టికి తీసుకురావడంతో సంఘం నిజనిర్ధారణ కమిటీ గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిందని వారు తెలిపారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కన్వీనర్, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ డాక్టర్ సీపాన గుణవతి, రాష్ట్ర అడ్వైజర్ శ్రీ ఎస్.జి. ప్రసాద్ సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు.సంఘం ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి దామోదరపురం గ్రామాన్ని సందర్శించి, డిసెంబర్ నాటికి రహదారి మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ విషయాలు తెలుగు, ఆంగ్ల పత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు.అయితే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం ప్రారంభించిన అనంతరం ఎప్పుడు ప్రజలు గుర్తు రాని కొంతమంది రాజకీయ నాయకులు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం మేకపోతు గాంబీర్యమేనని గోవిందరాజులు, సోమశేఖర్ యాదవ్ విమర్శించారు.“ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నాయకులు ప్రజల కోసం ఎవరితో ప్రత్యుత్తరాలు కొనసాగించారు సమస్యల పరిష్కారానికి బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు ఎవరు ముందుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారో ప్రజలకు తెలుసు. ఒకరు చేస్తున్న ప్రయత్నంలోకి వచ్చి, 15 రోజుల తరువాత అదే అంశాన్ని తమ కార్యక్రమంగా చూపించుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని జాతీయ బీసీ సంక్షేమ సంఘంగా నీతి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తున్నాం” అని వారు స్పష్టం చేశారు.స్మశానవాటిక లేకపోవడంతో దామోదరపురం ప్రజలు ఇళ్ల పెరళ్లలోనే మృతదేహాలను దహనం చేసుకునే దుస్థితి నాయకులకు కనిపించలేదా వినిపించలేదా అని వారు ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో పదవులు దక్కించుకొని విలాస వంతమైన జీవితాలు గడుపుతున్న నాయకులు ఈ విషయంలో సిగ్గుపడాలని వారు తెలిపారు “ఇలాంటి ప్రధాన సమస్యలు గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు కాలర్ ఎగరేయడం కాదు.. అప్పట్లో పదవుల్లో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి” అని ప్రశ్నించారు. ఇప్పటికీ మీ నాయకులే సోంపేట మండల ప్రజా పరిషత్ లో అధికారులు ఉన్నారని అభివృద్ధి చేసి చూపించండి అని వారన్నారు ఇటీవల గర్భిణీకి అత్యవసర సమయంలో అంబులెన్స్ సదుపాయం అందక ప్రాణాపాయ స్థితిలో గర్భశ్రవం జరిగినఘటన తమను తీవ్రంగా కలచివేసిందని గోవిందరాజులు, సోమశేఖర్ యాదవ్ పేర్కొన్నారు ఈ ఘటనను ప్రభుత్వ హత్యగా మీ భజన పత్రికలో విమర్శించారు దానిలో మీ భాగస్వామ్యం ఎంత మీరు తెలుసుకున్నారా ఈ పాపం ఎవరిదని వారు అన్నారు . ఇలాంటి ఘటనలకు దారితీస్తున్న మౌలిక వసతుల లోపాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం మండల పరిషత్ స్థాయిలో మీ నాయకులే అధికారుల ఉన్నందున గొల్లూరు పంచాయతీలోని కండ్రవీధి తదితర ప్రాంతాల ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించి చూపించాలని ఇదే విధంగా ఎన్ డి ఎఫ్ సి లో స్థానికులకు ఉద్యోగం కల్పించే చర్య చేపట్టండి అని డిమాండ్ చేశారు గతంలో ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకుని, ఇప్పుడు మీ పరిధిలో ఉన్న అధికారులతో దామోదరపురం సమస్యలను ఎంతవరకు పరిష్కరించగలరో చేసి చూపించండి. ప్రజల కోసం ఎవరు నిజంగా పనిచేస్తున్నారో ప్రజలే నిర్ణయిస్తారు” గోవిందరాజ, సోమశేఖర్ యాదవ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

క్షేత్రస్థాయిలో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన సీపీ డా. యం. రమేష్‌, సీ ఎం సి కమిషనర్ సృజన, ఇతర అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: సీపీ రమేష్‌

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]