*నేడు ప్రంపంచ జానపదం దినోత్సవం- తెలుగు జానపద విజ్ఞానం* జానపదుల సమస్త సంస్కృతిని తెలిపేదే జానపద విజ్ఞానం. ఇది చాలా విశాలమైంది. జీవితానికి, సంస్కృతికి సంబంధించిన అన్ని విషయాలను తనలో ఇముడ్చుకోగలిగినంత విస్తృత పరిధి కలది. జానపద విజ్ఞానం అత్యంత ప్రాచీన కాలానికి సంబంధించిన సాంప్రదాయక జ్ఞానమని, మరో విధంగా చెప్పాలంటే అది సజీవ శిలాజం వంటిది. జానపదులకు చెందిన ఆచారాలు, నమ్మకాలు, కథాగేయాలు, సామెతలు మొదలైనవన్ని జానపద విజ్ఞానం. జానపదులు అంటే ఏదైనా ఒక విషయంలో భావస్వామ్యం కలిగిన జన సముదాయం. వీరు ఒక భాషకు సంబంధించిన వారు కావచ్చు. ఒక ప్రదేశంలో నివసిస్తున్న వారు కావచ్చు, ఒక జాతికి, ఒక మతానికి, ఒక వృత్తికి సంబంధించిన వారు కావచ్చు వీరినే జానపదులుగా కూడా చెప్పవచ్చు. జానపదుడు తన జీవితానికి కారణభూతమైన దైవశక్తిని ప్రాచీన కాలం నుండి ఆరాధిస్తూ మనస్సును నెమ్మది పరుచుకున్నాడు. ఈ దేవతారాధన క్రమంలో పుట్టిన పాట-నృత్యం కాలక్రమేణ కొన్ని దేవతల ఆరాధనల కోసమే స్థిరపడ్డాయి, మరి కొన్ని వినోదం కోసం మిగిలాయి, ఇంకా కొన్ని జీవనాధారాలు అయినాయి. ఈ కళల్లో జానపదుల అసాధారణ ప్రతిభ కన్పిస్తుంది. ఒక్కొక్క కళకు అర్థవంతమైన నేపథ్యం ఉంటుంది. ఈ కళల్లో వాద్యప్రధానమైనవి, గేయ ప్రధానమైనవి, సంగీత ప్రధానమైనవి మరికొన్ని అభినవ ప్రధానమైనవి ఉన్నాయి.ఈ జానపద కళలన్నీ మన జానపదుల శ్రద్ధాసక్తుల వల్లనే నేటికీ నిలదొక్కుకుంటున్నాయి. మానవుడు భౌతికంగా జీవించడానికి గాలి, నీరు, వెలుతురు, ఆహారం ఎలా అవసరమో సంగీతం, సాహిత్యం, కళ అనేవి కూడా అతడు మానసికంగా, ఉల్లాసంగా జీవించడానికి అంతే అవసరం. ఈ కళలు మానవునికి ఆనందానుభూతితో పాటు హృదయాన్ని విశాలం చేస్తాయి. జానపద కళాకారులు ప్రాచీన కాలం నుండి తమ కళా సంపదను ఒక తరం నుండి మరో తరానికి అందిస్తూ ప్రజలకు ఆనందాన్ని, సంతోషాన్ని అందించి తమ జీవనాన్ని కొనసాగించేవారు. వీరిని ‘సంస్కృతీ వాహకులుగా’ కూడా పేర్కొనవచ్చు. జానపద కళాసంపదను కాపాడుతూ కథాగానమే వృత్తిగా స్వీకరించిన వారిని భిక్షుక గాయకులని, ఆశ్రిత జాతులని, వృత్తి గాయకులని పిలుస్తున్నారు.జానపద విజ్ఞానం మౌఖికమైనది, సాంఘిక ఆచారాలు, వస్తు సంస్కృతమైనది, జానపద కళలు కళారూపాలు. బొమ్మలాటలు, ఆచార సంబంధమైన అనుష్టాన కళారూపాలు, వాద్య కళారూపాలు, పటం కథలు, ఇంద్రజాల ప్రదర్శనలు, నృత్యాలు, కథాగాన కళారూపాలు, వేశాలలో ప్రదర్శించే కళారూపాలు, భజనలు,ఆశ్రిత వ్యవస్థ మరియు అందులోని కళారూపాలు తెలుగు వారికి కలవు.తెలుగువారి ఆశ్రీత కళారూపాలకు సంబంధించిన కళారూపం వారికి గల పోషక కులం వారు ప్రదర్శించే కుల పురాణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. *ఆశ్రిత కళారూపాలు-ప్రదర్శనలు:* కూనపులి పటం కథ-మార్కండేయ పురాణం, సాధనాశూరులు-ఇంద్రజాల ప్రదర్శన, సింగన వారు దేవాంగ పురాణం, జాతి బిడ్డలు / జంగాలు జంగం కథ, గొంధళే వీధి భాగోతం గొంధలే వీధి భాగవతం,గౌడజెట్టి పటం కథ గౌడ పురాణం, ఏనూటి పటం కథగౌడ పురాణం, బీరన్నలు మరియు దేవినోల్లు బీరన్న కథలు, ఒగ్గువాళ్లు మల్లన్న కథలు బీరన్న కథ, బైకాని వారు బొమ్మల ప్రదర్శన, గొల్ల భాగవతులు భాగవతం, మంద హెచ్చుల కథ కాటమరాజు కథలు, పొడపోతుల వారు పొడపోతుల కథ/ గొల్ల కథలు, కొమ్ముల అడ్డంపటం కథ కొమ్ముల వారి కథలు, గోత్రాల వారు యాదవ కథ, సుద్దుల వారు / గొల్ల దాసర్లు దాసరి & గొల్ల కథలు, రుంజ విశ్వకర్మ పురాణం, పనస విశ్వకర్మ పురాణం, బేరి పనస కన్యపురాణం, పిచ్చుక కుంట్లు రెడ్డి కుల పురాణం, కమ్మపిచుకకుంట్లు కమ్మ కుల పురాణం, విప్రవినోదులు గారడి విద్యలు, గంగ పూజారులు యాదవ భాగవతం, తెలచీర పటం కథ మల్లన్న కథ, కాకిపడిగెల కథ పాండవుల కథ, ఆదికొడుకులు మేదరి కథ, అద్దంసింగులు అద్ధపురాణం, పెక్కర్ల పటం కథ గుండె బ్రాహ్మ పురాణం, మాసయ్య పటం కథ మడేలు పురాణం, తెనుగు మాష్టి మాష్టి కథ, తెనుగు భోగం భోగం ఆట, చిందు భాగవతం/చిందుయక్షగానం చిందు భాగోతం, డక్కలి పటం కథ జాంబ పురాణం, బైండ్ల / బవని ఎల్లమ్మ మందాత కథ, సంగడివారు పురాణ ప్రవచనం, నులక చందయ్యలు పురాణ ప్రవచనం, ఆసాది కథ, మాదిగ భోగం యక్షగాన ప్రదర్శన, గుఱ్ఱం పటంకథ బేతాళ పురాణం, మాల మాష్టి వారు పురాణ ప్రవచనం, మాల భోగం భోగం ఆటలు, మిత్తిలి అయ్యవార్లు రామాయణం,కొర్రాజుల పటం కథ(తోటి) పద్మనాయక వృత్తాంతం,పట్టెడ వీరు కోయ పురాణం లేదా దొర పురాణం, డోలి దూర పురాణం, తోటి వారు పాండవ కథ, పూజారి పటం కథ పద్మనాయక వృత్తాంతం, భాట్స్ కుల పురాణం, దాడీ వారు కుల పురాణంమరి అంతరించిపోతున్న జానపద కళారూపాలను ముందు తరాల వారికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే కొన్ని కళలను తమ వారసత్వంగా వస్తున్న వారసులు ఇతర వృత్తులకి వలస వెళ్లడం ఆధునిక టెలివిజన్, కంప్యూటర్స్ యానిమేషన్, అంతర్జాల మీడియా ప్రభావంతో అపురూపమైన కళారూపాలను ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది! మన అందరిది.వ్యాస రచయిత:డా.తూము విజయ్ కుమార్ చరవాణి-9492700653
నేడు ప్రంపంచ జానపదం దినోత్సవం- తెలుగు జానపద విజ్ఞానం* జానపదుల సమస్త సంస్కృతిని తెలిపేదే జానపద విజ్ఞానం.
