మున్సిపల్ అధికారుల ధన దాహానికి ఇద్దరు బలి! ———————————————— @ కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం @ కేవలం 50 గజాల్లో నిర్మిస్తున్న భవనం @ మాదాపూర్ పరిధిలోని అంజయ్య నగర్ లో ప్రమాదం @ భవన శిధిలాలు పడి ఇద్దరు మృతి@ భావనానినికి అనుమతులు ఇచ్చింది ఎవరు?@ బాధ్యులపై క్రిమినల్ చర్యలకు స్థానికుల డిమాండ్ అనుకున్నంత అయింది. స్థానిక ప్రజలు ఆందోళనస్ చెందినట్లే జరిగింది. జీరో పర్మిట్లతో, ఒకటి, రెండు అంతస్తుల అనుమతితో బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా వెలిసాయి. నిబంధనలకు విరుద్దంగా వెలుస్తున్న భవనాలు ఎప్పుడు కూలిపోతాయో, ఎవరి ప్రాణాలు హరిస్తాయో అంటూ స్థానికులు ఆందోళన చెందినట్లుగానే ఏడంతస్తుల భావన కుప్పకూలింది. ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్ లో 50గజాల స్థలం లో చేపట్టిన 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. అంజయ్య నగర్లో కేవలం 50 గజాల స్థలంలో … నాలను అనుకుని అక్రమంగా ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న భవనం ఒక్కసారిగా కుప్పకూలి పక్కనే ఉన్న ఆపార్టుమెంట్పై పడింది. దీంతో అదికూడా పాక్షికంగా దెబ్బతిన్నది. మరో వైపు … మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్లో నిర్మాణం పూర్తి అయిన ఏడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాలా పక్కనే ఉన్న 50 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. ఇటీవలే భవన నిర్మాణం పూర్తి కాగా.. అద్దెకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ భవనం శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాలు పక్కనే ఉన్న అపార్టుమెంట్ మీద కూడా పడ్డాయి. ప్రమాదం కారణంగా భారీ శబ్దం రావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీప హాస్టల్ విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు కార్మికులు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం కాగా.. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికి తీశారు.. మరోవైపు భవనం శిథిలాలు పడటంతో పక్కనున్న అపార్టుమెంట్ గోడలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.క్రిమినల్ కేసులు పెట్టాలి! ———————-50 గజాల స్థలంలో ఏడూ అంతస్తుల భావనానినికి అనుమతులు ఇచ్చింది ఎవరు? అనుమతులు ఇవ్వకున్నా అక్రమంగా నిర్మిస్తున్నారు అనుకుందాం.. టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమిచేస్తున్నట్లు? జీతాలు తీసుకొని ఇళ్లల్లో పడుకుంటున్నారా? లేక బిల్డర్ ఇచ్చే లంచాలు మింగి, కళ్ళు మూసుకుంటరున్నారా? టౌన్ ప్లానింగ్ అధికారుల ధనదాహానికి ఈ రోజు రెండు నిండు ప్రాణాలు బలయినట్లే కదా? అందుకే బాధ్యులయిన టౌన్ ప్లాంయింగ్ అధికారులను వెంటనే విధులనుంచి తప్పించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు త్వేసుకోవాలని , ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
మున్సిపల్ అధికారుల ధన దాహానికి ఇద్దరు బలి! ———————————————— @ కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం @ కేవలం 50 గజాల్లో నిర్మిస్తున్న భవనం @ మాదాపూర్ పరిధిలోని అంజయ్య నగర్ లో ప్రమాదం @ భవన శిధిలాలు పడి ఇద్దరు మృతి@ భావనానినికి అనుమతులు ఇచ్చింది ఎవరు?
