కుత్బుల్లాపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామం మరియు చింతల్ ప్రాంతాల్లో జరిగిన పాలారం బండి ఊరేగింపు కార్యక్రమాల్లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నాయకులు శ్రీ నల్ల జై శంకర్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.కుత్బుల్లాపూర్ గ్రామం, చింతల్ ప్రాంతాల్లో భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నల్ల జై శంకర్ గౌడ్ తో పాటు పులి బలరాం , ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను.
కుత్బుల్లాపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు
