*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో కూకట్‌పల్లిలో అభివృద్ధికి కొత్త శకం : బండి రమేష్*ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కె.పి.హెచ్.బి ప్రజయ్ అపార్ట్మెంట్స్ రోడ్, గోకుల్ ప్లాట్స్ వద్ద ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ , మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ ,టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పేదలు, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని చెప్పారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో గృహ నిర్మాణ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇందిరమ్మ టవర్స్ వంటి నిర్మాణాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.శ్రీ బండి రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూకట్‌పల్లి నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కూకట్‌పల్లి ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయమని తెలిపారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన గృహ వసతి కల్పించడంతో పాటు నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారానికి శ్రీ బండి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూకట్‌పల్లిని మరింత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు,డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.📍 స్థలం: కె.పి.హెచ్.బి – ప్రజయ్ అపార్ట్మెంట్స్ రోడ్, గోకుల్ ప్లాట్స్, కూకట్‌పల్లి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో కూకట్‌పల్లిలో అభివృద్ధికి కొత్త శకం : బండి రమేష్*ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో
