*రాష్ట్రప్రభుత్వ అధికారికా కార్యక్రమాలుగా* *పండుగ సాయన్న జయంతి వర్ధంతి సభలు* *జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం* హైదరాబాద్ /ఆదిలాబాద్ ఆగస్టు 20 (న్యూస్ ) : ముదిరాజుల ఆరాధ్య దైవం నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో దొరలు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు సాగిస్తున్న అరాచకాలను ఆనాడే ఎదిరించి పోరాడి అమరుడైన పాలమూరు ముద్దుబిడ్డ పండుగల సాయన్న జయంతి వర్ధంతి సభలను అధికారిక కార్యక్రమాలు గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ RT 1217 ను విడుదల చేయడం పట్ల తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజులు సమన్వయ సంఘాల కమిటీ పక్షాన హర్షం ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జజు గురువారం నాడు జీవో విడుదల చేసినట్లు వారు వెల్లడించారు. గత ఏడాది కాలంగా ముదిరాజ్ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ప్రస్తుత పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ మరియు క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారి నాయకత్వంలో ముదిరాజ్ ఫైనాన్స్ క డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముదిరాజ్, రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం ముదిరాజ్, నాయకులు రావుల రాజశేఖర్ ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శ్రమశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, మెదక్ పార్లమెంట్ కాంటెస్ట్ సభ్యులు యువ కెరటం నీలం మధు ముదిరాజ్ , కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు మో త రోహిత్ ముదిరాజ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మత్స్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెల సంతోష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు ఈటెల భద్రయ్య ముదిరాజ్, పాటు ముదిరాజ్ యువజన సంఘాల నాయకులు గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ ,అల్లుడు జగన్ ముదిరాజ్, పండుగల సాయన్న సేవా సమితి అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, కొరివి కృష్ణ స్వామి సేవా సమితి అధ్యక్షులు పిట్ల నగేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమ లక్ష్మణ్ ముదిరాజ్, కోలీ సమాజ్ జంట నగరాల అధ్యక్షులు మర్రి ప్రభాకర్ ముదిరాజ్, పిట్ల మోహన్ రాజ్, కొట్టాల యాదగిరి ముదిరాజ్, ముదిరాజ్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డబోయిన వినోద్ ముదిరాజ్, దమ్మి గారి కనకయ్య ముదిరాజ్ ,ప్రకాష్ ముదిరాజ్ కాయిత సతీష్ ముదిరాజ్ తదితరులు గత అనేక దఫాలుగా ఏడాదికాలంగా పలుమార్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సుదీర్ఘంగా చర్చించి ఇటీవల ముఖ్యమంత్రికి నివేదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి జీవోను విడుదల చేయడం పట్ల ముదిరాజ్ సంఘాల సమన్వయ కమిటీ సంఘాల సభ్యుల పక్షాన హర్షం ప్రకటి స్తున్నాము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా చిరకాల డిమాండ్ అయిన ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ లోకి మార్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు 2009లో విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 15 ను యధావిధిగా అమలు చేయాలని కోరుతున్నాము. దీనిపై ఇప్పటికే కామారెడ్డి లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చిన విధంగా బీసీ ఏ అంశాన్ని సీరియస్ గా తీసుకొని అమలు చేసినట్లయితే ముదిరాజు యువతి యువకులకు విద్యా ఉపాధి రంగాలతో పాటు రాజకీయ రంగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కలిగి ఆర్థికంగా సామాజికంగా ముందుకు సాగే అవకాశం ఉందని ఈ సందర్భంగా సమన్వయ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగర తొలి మేయర్ స్వాతంత్ర సమరయోధులు బహుముఖ ప్రజ్ఞాశాలి ఖత రచయిత ఆర్కిటెక్ట్ అయిన కీర్తిశేషులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వర్ధంతి సభలను అధికారిక కార్యక్రమంలో నిర్వహించడమే కాకుండా పండుగల సాయన్న కృష్ణస్వామి విగ్రహాలను హైదరాబాదు నగర నడిబొడ్డున ఉన్న ట్యాంకుబండ్‌పై ప్రతిష్టించాలని ముదిరాజ్ సంఘాల సమన్వయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ముదిరాజు సోదరులందరూ ఈ విషయాన్ని గమనించి వచ్చే అక్టోబర్ 22న పండుగల సాయన్న జయంతి కార్యక్రమాన్ని అదే విధంగా డిసెంబర్ 10న వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ముదిరాజ్ సమన్వయ సంఘాల కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం చిన్నచిన్న విషయాలను గోరంతలు కొండంతలుగా చేస్తూ కొందరు ఎవరి మొక్కు పొందడానికో చేస్తున్న అర్థం లేని విమర్శలకు ఇకనైనా పులిస్టాప్ పెట్టి చేతనైతే ముదిరాజ్ సంఘాల సమన్వయ కమిటీ చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము పండుగల సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ అన్న బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నలు చేసిన కృషిని ముదిరాజ్ జాతి ఎప్పటికీ మరిచిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంది
రాష్ట్రప్రభుత్వ అధికారికా కార్యక్రమాలుగా* *పండుగ సాయన్న జయంతి వర్ధంతి సభలు* *జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం*
