బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
తెలంగాణ

శ్రీశైలం దేవస్థానంలోని *శాస్త్రోక్తంగా స్వామివారిని సహస్ర ఘటాభిషేకం

శ్రీశైలం దేవస్థానంలోని *శాస్త్రోక్తంగా స్వామివారిని సహస్ర ఘటాభిషేకం

శ్రీశైలం దేవస్థానంలోని *శాస్త్రోక్తంగా స్వామివారిని సహస్ర ఘటాభిషేకం* నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 10 ( గ్రామ దండోరా న్యూస్ )• నాల్గవ రోజు కొనసాగుతున్న వరుణ యాగ సహితసహస్ర ఘటాభిషేకం• ఈ ఉదయం విశేష పూజలతో ప్రారంభమైన ఘటాభిషేకం• వెయ్యికిపైగా కలశాలతో శాస్త్రోక్తంగా శ్రీమల్లికార్జునస్వామివారికి అభిషేకం…• విశేషపూజలలో పాల్గొన్న దేవదాయశాఖ అదనపు కమిషనరు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండాలనే సంకల్పంతో తేది :07.08.2026 నుండి 11.08.2026 వరకు 5 రోజులపాటు నిర్వహింపబడుతున్న వరుణయాగసహిత సహస్ర ఘటాభిషేక కార్యక్రమాలలో నాలుగవరోజు అయిన కొనసాగాయి.ఇందులో భాగంగా ఈరోజు వేకువజామున ఏకాదశ రుద్ర ఋష్యశృంగ సహిత సహస్ర ఘటార్చన, మహాన్యాస పారాయణ, రుద్రపారాయణ, కాఠక శతానువాక పారాయణ, వేదపారాయణలు, వారుణానువాక సహిత ఋష్యశృంగ పారాయణ, రుద్రహోమం, చండీపారాయణ, శ్రీచక్రార్చాన, నవావరణార్చన విశేష కుంకుమార్చనలు జరిపించబడుతున్నాయి. కాగా కృష్ణవేణీ పుణ్యనదీజలాలలోతోనూ ఆలయప్రాంగణములోని మల్లికాగుండ పవిత్రజలంతోనూ ఈ అభిషేకం జరిపించబడింది. కార్యక్రమములో భాగంగా ఈ నెల 07 తేదీ నుంచి ఋష్యశృంగజపం, వారుణానువాక పారాయణలు, వరుణజపం, భాగవత, విరాటపర్వ పారాయణలు పంచాక్షరీ జపాలు జరిపించబడుతున్నాయి. దేవస్థానం అర్చకస్వాములు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 36 మంది ఋత్వికులు ఈ కార్యక్రమములో పాల్గొంటున్నారు. ఆరుద్రోత్సవ పూజాదికాల అనంతరం ముందుగా ఈ ఉదయం అర్చకస్వాములు ఘటాభిషేక సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, రాష్ట్రంలో చెరువులు, జలాశయాలలోకి సమృద్ధిగా నీరు చేరాలని జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని పేర్కొనడం జరిగింది. సంకల్పం తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించబడింది. అనంతరం అర్చకస్వాములు పాతాళగంగ వద్ద కృష్ణవేణీనదీమతల్లికి పూజాదికాలు జరిపి కలశాలలో కృష్ణవేణీనదీ పుణ్యనదీజలాలను తీసుకురావడం జరిగింది. తరువాత అర్చకస్వాములు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, పలవురు ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు సంప్రదాయాన్ని అనుసరించి కృష్ణవేణీనదీ జలాలతో పాతాళేశ్వరస్వామివారి ఆలయంలో అభిషేకాది అర్చనలను నిర్వహించారు. అనంతరం వీరందరూ జలకలశాలను తలపై పెట్టుకుని వేదమంత్రాల నడుమ భజంత్రీలతో నందిఆలయం వద్దకు చేరుకున్నారు. నందిగుడిలో నందీశ్వరస్వామివారికి, ఆ తరువాత గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి అనంతరం క్షేత్రపాలకుడు వీరభద్రస్వామివారికి అభిషేకాది అర్చనలను జరిపించారు. తరువాత వీరందరూ జలకలశాలతోనే ప్రధానాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆలయప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో నెలకొల్పబడిన ప్రధాన కలశాలకు, ఇతర కలశాలకు, కృష్ణవేణీనదీజల కలశాలకు శాస్త్రోక్తంగా పూజాదికాలు జరిపించబడ్డాయి. ఈ పూజాదికాల తరువాత మల్లికార్జునస్వామివారికి సహస్రఘటాభిషేకం ప్రారంభించబడింది. ఈ ఘటాభిషేకం పూర్తయ్యేంతవరకు నిరంతరంగా అర్చకస్వాములు రుద్రమంత్రాలను పఠించడం జరుగుతుంది. ఈ ఘటాభిషేకం పూర్తయిన తరువాత మహానివేదన, నీరాజన, మంత్రపుష్ప కార్యక్రమాలు జరిపించబడుతాయి. కాగా ఈ ఘటాభిషేకం సందర్భంగా స్వామివారి గర్భాలయానికి అడ్డంగా మూడు అడుగుల మేర తాత్కాలికంగా గోడ కట్టడం జరిగింది. దాంతో ఈ రోజంతా కూడా స్వామివారు ఘటాభిషేకజలంలోనే ఉంటారు. ఈ కార్యక్రమములో దేవదాయశాఖ అదనపు కమిషనరు శ్రీఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఎ.వి. రమణ, శ్రీమతి బి. రవణమ్మ, శ్రీ చిట్టిబొట్ల భరద్వాజశర్మ, శ్రీమతి జి. లక్ష్మేశ్వరి, శ్రీ దేవికి వెంకటేశ్వర్లు, శ్రీ మేడా మురళీధర్, శ్రీమతి యు. సుబ్బలక్ష్మీ, శ్రీమతి జిల్లెల శ్రీదేవి, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కారుపర్తి నాగమల్లేశ్వరరావు, శ్రీ ఆకుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు *రేపటి కార్యక్రమాలు* రేపు (11.08.2026) ఉదయం గం. 9.15లకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మహదాశీర్వచనంతో ఈ వరుణ యాగ సహితసహస్ర ఘటాభిషేక విశేష పూజలు ముగుస్తాయి.

పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]