శేరిలింగంపల్లి నియోజకవర్గ అల్విన్ కాలనీ శ్రీ మహంకాళి బోనాల జాతర సందర్బంగా అల్విన్ కాలనీ ఫేస్2 కట్ట శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహిళ అధ్యకురాలు శ్రీదేవీ తోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా గణేష్ నేత పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గణేష్ మాట్లాడుతూ ఆల్విన్ కాలనీ లాస్ట్ బస్టాప్ నుండి శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం పాలహార బండి పోతారాజుల విన్యాసం, ఆల్విన్ సొసైటీ పెద్దలు కృష్ణరెడ్డి సమ్మారెడ్డి కొండారెడ్డి స్వరాజ్యం శ్రీనివాసరావుల ప్రోద్బలంతో ఉరేగిపు నిర్వహించడం అమ్మవారి దివ్యమైన ఆశిషులు ప్రజాలందరిపైన ఉండాలని ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అమ్మవారి ఊరేగింపు దర్శన భాగ్యం కల్పించిన సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెల్పుతూ వారి ఆదరణ ప్రేమ నాపై ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో గుట్ట సాయి స్వరూప్ బంగారి సాగర్ ఎల్లాగౌడ్ దాయనంద్ రాజుయాదవ్ నవీన్ దీరాజ్ తదితరులతోపాటు కాలనీ వాసులు భక్తులు పాల్గొన్నారు.
ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న జిల్లా గణేష్ నేత
