బ్రేకింగ్ న్యూస్
పండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపిపండుగ సాయన్న స్ఫూర్తితో బీసీఏ కోసం ఉద్యమిద్దాం మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్ముదిరాజ్ ను బిసి ఏలో చేర్చే ప్రయత్నం మంత్రివర్గంలో చర్చిస్తాంబండి రమేష్ సేవా సంస్థ ద్వారా విద్యార్థిని డి. వర్షిణికి బీటెక్ ఫస్టియర్ రూ.15,000 ఆర్థిక సహాయం అందించిన బండి రమేష్దుర్గమ్మకు రామకోటి రామరాజు కళాత్మక నీరాజనం**నవరాత్రుల ముగింపున నవధాన్యాలతో దుర్గామాత**30 ఏళ్ల ఆధ్యాత్మిక కళాప్రస్థానం అమోఘం*దసరా పర్వదినం సందర్భంగా డాక్టర్ మల్లు రవి కి శుభాకాంక్షలు తెలిపిన శేరి సతీష్ రెడ్డిశ్రీశైలం దేవస్థానంలోని చివరి రోజు *దసరా మహోత్సవాలుప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సైన్ చేదు లేదుదివ్యాంగుల ఎవర్నెస్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాంముస్లిం మత పెద్దలతో సమావేశమైన డిసిపిముస్లిం కమ్యూనిటీ పెద్దలతో సమావేశమై డిసిపి
ఆంధ్రప్రదేశ్

నందీశ్వరస్వామివారికి విశేషపూజలు* నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 10( గ్రామ దండోరా న్యూస్ )

నందీశ్వరస్వామివారికి విశేషపూజలు* నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 10(  గ్రామ దండోరా న్యూస్ )

*నందీశ్వరస్వామివారికి విశేషపూజలు* నంద్యాల జిల్లా శ్రీశైలం ఆగస్టు 10( గ్రామ దండోరా న్యూస్ ) త్రయోదశి సందర్భంగా దేవస్థానం నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన జరిపించబడుతుంది. ప్రతీ మంగళవారం రోజున మరియు త్రయోదశిరోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో అనగా శుద్ధ త్రయోదశి మరియు బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించబడింది. కాగా ఈ రోజు మొత్తం 32 మంది భక్తులు పరోక్షసేవగా ఈ నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకుంటున్నారు.ఈ పరోక్షసేవలో తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ విశేషపూజను నిర్వహించుకుంటున్నారు. అలాగే యూ.కె నుంచి ఒక ప్రవాస భారతీయుడు కూడా ఈ విశేషపూజలను నిర్వహించుకుంటున్నారు. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతోంది. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజను జరిపించబడుతోంది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేస్తారు. అనంతరం నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరుగుతుంది. కాగా త్రయోదశి రోజున జరిపించబడే నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్‌లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు. నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానంలేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టినశనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్దంగా ఉంది. ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేయడం జరుగుతున్నది. సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును. కావున భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించవచ్చును.

నంద్యాల జిల్లాశ్రీశైలం వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలో ఓకే కుటుంబం లో ఐదు మంది ఊరివేసుకొని ఆత్మహత్య

[mlam_ad_display placement="sidebar" limit="2" only_ts_ap="yes"]